
వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు చవాకులు
మీ తింగరి చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కాదా?
లెక్చరర్లలో మిగులు ఎందుకు ప్రకటించినట్లు?
ఎక్స్ వేదికగా మండిపడిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ‘బాబూ.. లోకేశ్..! మీ తండ్రి చంద్రబాబు 100కు 100 శాతం అబద్ధాలు చెప్తే మీరు 100కు 200 శాతం అబద్ధాలు చెప్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నిలువెత్తు అబద్ధాలకు అసలైన, సిసలైన వారసుడు మీరే. ‘సాక్షి’ పత్రిక వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. ‘ఎన్టీఆర్‌గారిని మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర్నుంచి, అత్యంత చెత్త పాలన చేస్తున్న మీకు జాకీలుగా పనిచేయడమే ఎల్లో మీడియా పని. నాణేనికి రెండోవైపు చూపిస్తున్న ‘సాక్షి’పై మీ దుగ్ధ కొత్త విషయమేమీ కాదు’ అని స్పష్టం చేసింది. ట్వీట్ ద్వారా ఇంకా వైఎస్సార్‌సీపీ ఏమన్నదంటే...?
⇒ లోకేశ్ గారూ... తమ ఏలుబడిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్న సంగతి ప్రజలకు తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోకపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లలో మిగులు ఎందుకు ప్రకటించినట్లు? ఆయా కాలేజీల్లో 455 పోస్టులను ఎందుకు రద్దు చేశారు? మరో 150 మంది లెక్చరర్లను మిగులుగా ప్రకటించడానికి ఎందుకు ఫైల్ సిద్ధం చేసినట్టు?
⇒ గత ఏడాది కన్నా అడ్మిషన్లు పెరిగితే లెక్చరర్ల సంఖ్య పెరగాలి కదా? ఏప్రిల్ 23న టెన్త్, జూన్ 12న సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు జూన్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. జూలై పూర్తి కావొస్తోంది. అయినా, ఇంకా అడ్మిషన్లు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలను మరుగునపరచడమే కదా?
⇒ మీ తింగరి చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కాదా? ‘సాక్షి’ పత్రిక ఆ విషయాన్ని జూలై 9న వెలుగులోకి తీసుకురాలేదా? ఇప్పుడు కూడా ‘సాక్షి’ వాస్తవాలను రాసేసరికి అంకెల గారడీ చేయడానికి మీరు సాగిస్తున్న ప్రయత్నాలపై మీ శాఖ సిబ్బందిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నమాట వాస్తవం కాదా?

⇒ విద్యా సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచి్చన హైసూ్కల్ ప్లస్ ఎందుకు రద్దు చేశారు?
⇒ బాలికలకు మండలానికో జూనియర్ కాలేజీ ఎందుకు రద్దైంది?
⇒ సీబీఎస్‌ఈని ఎందుకు రద్దు చేశారు?
⇒ ఐబీ దాకా ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు?
⇒ టోఫెల్ క్లాసులను ఎందుకు నిలిపేశారు?
⇒ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను ఎందుకు ఇవ్వడంలేదు?
⇒ డిజిటల్ ఎడ్యుకేషన్‌పై పెట్టిన సిలబస్‌ను ఎందుకు రద్దు చేశారు?
⇒ గోరు ముద్దను ఎందుకు దెబ్బతీశారు? ఇప్పుడు ఎందుకు ఆ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వలేకపో
తున్నారు? రోజుకో మెనూను ఎందుకు తీసేశారు?
⇒ నాడు–నేడు పనులను ఎందుకు నిలిపేశారు?
⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.6,400 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు?
వీటికి సమాధానాలు చెప్పగలరా లోకేశ్..? అని వైఎస్సార్‌సీపీ ఎక్స్ వేదికగా నిలదీసింది.