
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం)సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదా పీఠానికి బయల్దేరి వెళ్లారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి..,శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిశారు. వైఎస్ జగన్‌కు శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీ ఆశీస్సులు అందించారు.
వైఎస్ జగన్‌తో పాటు.. మల్లాది విష్ణు,వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లు శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని సందర్శించారు.