ప్రభాస్ అంటే ఇష్టం... విజయదేవరకొండ అంటే క్రష్

విశాఖపట్నం (భీమిలి): ప్రభాస్ అంటే ఇష్టం..విజయదేవరకొండ అంటే క్రష్..ఇద్దరితో కలిసి నటించాలని ఉంది. ప్రశాంతంగా ఉండే విశాఖ తన ఫేవరెట్ ప్లేస్. వధువు కట్నం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమయ్యా...ఆ తరువాత స్వాతి చినుకు సంధ్యవేళలో సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బండెనక బండికట్టి చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నా..ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నా.. ఒడిశాకు చెందినప్పటికీ చదువు నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డా. షూటింగ్ అనగానే విశాఖ గుర్తుకువస్తుంది..విశాఖలో సినిమా తీస్తే హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.
– అనోన్య, వర్ధమాన నటి