‘కరణ్‌ అర్జున్‌’ హీరో నరసన్నపేట కుర్రోడే | Tollywood Movie Karan Arjun Hero Native Narasannapeta Srikakulam | Sakshi
Sakshi News home page

‘కరణ్‌ అర్జున్‌’ హీరో నరసన్నపేట కుర్రోడే

Jun 24 2022 2:47 PM | Updated on Jun 24 2022 2:53 PM

Tollywood Movie Karan Arjun Hero Native Narasannapeta Srikakulam - Sakshi

సాక్షి,నరసన్నపేట(శ్రీకాకుళం): తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విడుదలవుతున్న ‘కరణ్‌ అర్జున్‌’ సినిమాలో హీరో నరసన్నపేట కుర్రాడే. పట్టణానికి చెందిన డాక్టర్‌ పొన్నాన సోమేశ్వరరావు కుమారుడు పొన్నాన మోహిత్‌ అభిమన్యు ఈ సినిమాలో హీరో. నరసన్నపేటలోనే పుట్టి పెరిగి సినిమాలపై ఉన్న ఆకాంక్షతో హైదరాబాద్‌ వెళ్లి మొదట్లో కొన్ని షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు.

ఇప్పుడు హీరోగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఆర్‌ఆర్‌ థ్రిల్లర్స్‌ ప్రొడక్షన్స్‌పై కరణ్‌ అర్జున్‌ నిర్మించారు. మోహన్‌ శ్రీ వత్స కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. నూతన నటి షఫా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నరసన్నపేటలో హీరో హీరోయిన్లు మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement