Pulivendula Riots Case: Court Sanctioned Bail To TDP MLC Btech Ravi - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి బెయిలు మంజూరు

Jan 18 2021 1:06 PM | Updated on Jan 18 2021 1:40 PM

TDP MLC Btech Ravi Got Bail In 2018 Riots Case Pulivendula - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : పులివెందుల పూల అంగళ్ల కూడలి అల్లర్ల  కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరైంది. నేడు సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా 2018 నాటి అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిని ఈ నెల 3న చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 4వ తేదీన పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే సోమవారం నాటికి రిమాండ్‌ గడువు ముగియడంతో బీటెక్‌ రవికి పులివెందుల కోర్టు బెయిలు మంజూరు చేసింది. (చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌)

చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement