భూ హక్కుదారులను పక్కకు నెట్టేసి సర్వేకు అడ్డురావొద్దని హెచ్చరిస్తున్న డీఎస్పీ భక్తవత్సలం
35 ఏళ్లకు ముందే కోర్టు సేల్ డీడ్ ఇచ్చిందన్న హక్కుదారులు
తప్పుడు నోటీసులతో సర్వే ఎలా చేస్తారని నిలదీత
అందరికీ నోటీసులు ఇచ్చాకే సర్వే చేపట్టాలని డిమాండ్
పట్టించుకోని అధికారులు
తిరుపతి మంగళం: తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. భూముల హక్కుదారులు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసు బందోబస్తు నడుమ అధికారులు సర్వే ముగించారు. తిరుపతి మారుతీనగర్లోని బుగ్గమఠం భూములలో శనివారం తప్పుడు నోటీసులతో దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ సర్వే అధికారులు పోలీసు బలగాలతో సర్వే చేసేందుకు సిద్ధపడ్డారు. వందేళ్లుగా పట్టం వెంకట్రాయులు ఆ«దీనంలో ఉన్న బుగ్గమఠం భూములకు సంబంధించి 35 ఏళ్ల క్రితమే భూముల క్రయ విక్రయాలు జరుపుకొనేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చిందని వెంకట్రాయులు కుమారులు, మనవళ్లతోపాటు ఇతర హక్కుదారులు డేగల మునికుమార్, ఎన్.యశోదమ్మ, పురంధర్, డేగల మునిరాజమ్మ, పట్టెం మునిప్రభాకర్ తెలిపారు.

ఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భూ హక్కుదారులు అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ సర్వే నిర్వహించాలన్నా ఆ భూములకు సంబంధించిన 9 మంది హక్కుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాక సర్వే నిర్వహించాలి కదా... అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి హఠాత్తుగా వచ్చి ఒకరు, ఇద్దరికి నోటీసులు ఇవ్వడం ఏమిటని, అందులో ఈ నెల 3వ తేదీన సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొని ఆ నోటీసును గత నెల 24న ఇచి్చనట్లుగా చెప్పడం చూస్తే.. వారు తప్పుడు నోటీసులు ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు.
న్యాయబద్ధంగా సర్వే నిర్వహించాలనుకుంటే భూ హక్కుదారులందరికీ 10 రోజులముందే నోటీసులు జారీచేసి అందరి సమక్షంలో సర్వే చేయాలన్నారు. అలాకాకుండా అర్ధంతరంగా వచ్చి బుగ్గమఠం భూముల సర్వే చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి ఏకపక్షంగా సర్వే
నిర్వహించారు.
భూ హక్కుదారులను పక్కకు నెట్టేసి సర్వేకు అడ్డురావొద్దని హెచ్చరిస్తున్న డీఎస్పీ భక్తవత్సలం
ఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భూ హక్కుదారులు అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ సర్వే నిర్వహించాలన్నా ఆ భూములకు సంబంధించిన 9 మంది హక్కుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాక సర్వే నిర్వహించాలి కదా... అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి హఠాత్తుగా వచ్చి ఒకరు, ఇద్దరికి నోటీసులు ఇవ్వడం ఏమిటని, అందులో ఈ నెల 3వ తేదీన సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొని ఆ నోటీసును గత నెల 24న ఇచి్చనట్లుగా చెప్పడం చూస్తే.. వారు తప్పుడు నోటీసులు ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు.
న్యాయబద్ధంగా సర్వే నిర్వహించాలనుకుంటే భూ హక్కుదారులందరికీ 10 రోజులముందే నోటీసులు జారీచేసి అందరి సమక్షంలో సర్వే చేయాలన్నారు. అలాకాకుండా అర్ధంతరంగా వచ్చి బుగ్గమఠం భూముల సర్వే చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి ఏకపక్షంగా సర్వే నిర్వహించారు.