
గుంటూరు: యూరియా అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే అభియోగంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలు ,దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాప్ లు చేసే వ్యక్తులపై పెట్టే 111 (3)(4)(5)సెక్షన్‌ను సాయి భార్గవ్‌పై పెట్టారు. అనంతరం సాయి భార్గవ్‌ను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.
సోషల్ మీడియా కేసులో 111(3)(4)(5) సెక్షన్ వర్తించదని వాదనను వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. విచారణ సందర్భంగా సిఐడి పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి తెలిపిన సాయి భార్గవ్. ఇన్ కెమెరా ప్రొసీడింగిడ్స్ తో సాయి భార్గవ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు
సిఐడి పోలీసులు తనను కొట్టారని సాయి భార్గవ్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంపై అతన్ని వైద్య పరీక్షల కోసం న్యాయవాది సమక్షంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
