ఆ..! పీకావులే బొచ్చు’.. ఈ ‘బొచ్చు’ విషయంలో మాత్రం కాదు..

Seven KG Bochu Fish In Konaseema District - Sakshi

సాక్షి, అమలాపురం: ‘ఆ..! పీకావులే బొచ్చు’ అంటూ తేలిగ్గా తీసి పారేస్తారు. ఈ మాట బొచ్చు (వెంట్రుకలు) విషయంలో నిజమే కానీ.. ఈ ‘బొచ్చు’ విషయంలో మాత్రం కాదు. గోదావరి డెల్టా కాలువల్లో బొచ్చ (దీనినే వాడుకలో ‘బొచ్చు’ అని కూడా అంటారు), శీలావతి, మోసు, ఎర్రమోసు వంటి చేపలు విరివిరిగా దొరుకుతుంటాయి. మహా అయితే ఇవి అర కేజీ, కేజీకి మించి బరువుండవు. గోదావరి నది నుంచి నీరు వచ్చినా పెద్ద చేపలు వచ్చే అవకాశం తక్కువ.
చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం..

అటువంటిది అమలాపురం-చల్లపల్లి పంట కాలువలో చల్లపల్లి వద్ద ఏకంగా ఏడు, ఆరు కేజీల చొప్పున బొచ్చు చేపలు దొరకడం విశేషం. పంట కాలువలు కట్టివేయడంతో ఉన్న కొద్దిపాటి నీటిలో ఇవి ఉన్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానానికి చెందిన చేపల వ్యాపారి బొమ్మిడి వెంకటరాజుకు ఏడు కేజీల చేప దొరకగా, మరో గ్రామానికి చెందిన వ్యక్తి ఆరు కేజీల చేప పట్టుకుని వెళ్లాడు. దీనిని అమలాపురం మార్కెట్‌లో విక్రయిస్తే రూ.1,500 పైబడి వస్తుందని వెంకటరాజు ‘సాక్షి’కి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top