ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నాం: సజ్జల 

Sajjala Ramakrishnareddy Said Employee Unions Have Cooperated Well - Sakshi

సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో చేయగలిగినంతా చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ వారికి చేయాల్సింది చేశామని పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబుల విషయంలోనూ సానుకూలంగా చేశామన్నారు. చర్చల్లో పాల్గొన్న టీచర్ల నేతలు అప్పుడే చెప్పి ఉంటే బావుండేదన్నారు.

చదవండి: మా ఆవేదనను సీఎం జగన్‌ అర్థం చేసుకున్నారు: ఉద్యోగ సంఘాలు

ఉపాధ్యాయులు అడిగినవి కూడా చేశాం. అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కోవిడ్‌ పరిస్థితుల్లో కూడా రూ.10వేల కోట్లకు పైగా అదనంగా ఖర్చు పెడుతున్నాం. హెచ్‌ఆర్‌ఏ స్లాబుల వల్ల రూ.1300 కోట్ల భారం. భవిష్యత్‌లో ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన చర్చించడానికి సిద్ధం. మంత్రుల కమిటీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. మేం ఉద్యోగులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. ఉన్నదానిలో ఉద్యోగులకు బెస్ట్‌ ప్యాకేజీ ఇచ్చాం. ఉద్యోగ సంఘాలు మంచిగా సహకరించాయి. సీఎం ఎన్ని స్కీములు పెట్టినా ఉద్యోగుల సహకారం అవసరం. ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top