స్పీకర్ తమ్మినేని సీతారాంకు తప్పిన ప్రమాదం

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్ద కాన్వాయ్‌లోకి ఓ ఆటో వేగంగా దూసుకుని వచ్చింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో తమ్మినేనికి ప్రమాదం తప్పింది. శనివారం మధ్నాహం శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా తిరిగి వెళ్లారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి