స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, బిల్డింగ్ ప్లాన్ వంటివి ఉంటేనే కొత్త ఇల్లు పంచాయతీలో నమోదు
గ్రామాల్లో ఈ ధ్రువీకరణ పత్రాలు ఉండేది కొద్దిమందికే
ఇబ్బందులు కలిగించే కొత్త నిబంధనలపై అధికారుల్లోనే చర్చ
సాక్షి, అమరావతి: కుటుంబ ఆస్తిగా వచ్చే స్థలాల్లో గ్రామాల్లో కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారు ఆ ఇంటిని గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేసుకోవడానికి ఇక మీదట తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. గ్రామాల్లో ఇళ్ల యజమానులు ఏటా చెల్లించే పన్ను రశీదే పెద్ద గుర్తింపుపత్రంగా ఉంటోంది. గ్రామాల్లో కొత్తగా కట్టే ఇళ్లను ఇంటిపన్ను మదింపునకు గ్రామ పంచాయతీ రికార్డులో చేర్చడానికి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. పంచాయతీల్లో ఇంటిపన్ను చెల్లించే ఇళ్ల యజమానుల జాబితాలను ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ చేసింది.
ఆన్‌లైన్‌కు ముందు, ఆన్‌లైన్ తర్వాత ఇప్పటివరకు నోటరీ లేదా అఫిడవిట్ ద్వారా కొత్త ఇళ్లను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. ఇల్లు నిర్మించిన స్థలం రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్ లేదా బిల్లిండ్ ప్లాన్ లేదా బిల్లిండ్ ప్రొసీడింగ్స్ ధ్రువీకరణ పత్రాలను కూడ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తేనే ఆ ఇల్లు పంచాయతీ రికార్డులో నమోదవుతుంది. ఈ మేరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో చేసిన మార్పుల సమాచారాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం క్షేత్రస్థాయి సిబ్బందికి తెలిపింది. ఈ నిబంధనలపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
డాక్యుమెంట్లు ఉండవని
అధికారులే అంటున్నా..
గ్రామాల్లో ఎక్కువమంది తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన స్థలాల్లోనే ఇళ్లు నిరి్మంచుకుంటారని, చాలావరకు రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు ఉండవని అధికారులే పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో బిల్డింగ్ ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకునేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆయా డాక్యుమెంట్లు ఉంటేనే పంచాయతీలో నమోదు చేస్తామన్న నిబంధనలు ఇల్లు కట్టుకునేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని చర్చ సాగుతోంది.
లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కట్టుకున్న ఇంటిని కనీసం పంచాయతీ రికార్డులో నమోదు చేయలేని పరిస్థితే ఉంటే ఇక ఆ యజమానికి ఏలాంటి ఆరి్థక ధీమా కలుగుతుందని పలువురు ప్రశి్నస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటిని పన్ను పరిధిలోకి తీసుకు రావాలని పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి నమోదుకే ఇబ్బందులు కలిగించే నిబంధనలు పెట్టడం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


