చంపింది ప్రియురాలి భర్త, మామలే! | police solved Yesu case in | Sakshi
Sakshi News home page

చంపింది ప్రియురాలి భర్త, మామలే!

Feb 19 2025 2:19 PM | Updated on Feb 19 2025 2:19 PM

 police solved Yesu case in

కొలిక్కివచ్చిన మజ్జి ఏసు హత్య కేసు

పోలీసుల అదుపులో నిందితులు!

హత్యకు సహకరించిన మరోవ్యక్తి కోసం పోలీసుల గాలింపు

నిడమర్రు(పశ్చిమ గోదావరి): బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల విచారణలో...
బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది.

పథకం ప్రకారం హత్య
నిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. 

ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

అత్యంత దారుణంగా హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement