ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిది బాల్య వివాహమే! | One in every five women was a child bride | Sakshi
Sakshi News home page

ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిది బాల్య వివాహమే!

Jun 19 2026 5:10 AM | Updated on Jun 19 2026 5:10 AM

One in every five women was a child bride

బిహార్, పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి మరీ దారుణం

పంజాబ్‌లోనూ పెరుగుదల.. ఏపీలో తగ్గుదల

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 20 శాతం మహిళలు 18 ఏళ్లలోపే వివాహం చేసుకుంటున్నారు. అంటే ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరు ఇప్పటికీ చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇది విద్య, సంతానోత్పత్తి, శ్రామిక శక్తి భాగస్వామ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలపై ప్రభావం చూపుతోందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాల ఆధారంగా ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదికను బుధవారం విడుదల చేసింది. 

18 ఏళ్లలోపు బాల్య వివాహాలు చేసుకున్న మహిళలు 2005–06లో దేశంలో 47.4 శాతం 2023–24 నాటికి 20.1 శాతానికి తగ్గింది. బిహార్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో బాల్య వివాహాల పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ మూడింట ఒక వంతు యువతులు చట్టబద్ధమైన వయస్సు కంటే ముందే వివాహం చేసుకుంటున్నారు. 

గత ఐదేళ్లలో పంజాబ్‌లో బాల్య వివాహాల శాతం పెరగడం గమనార్హం. మిగతా రాష్ట్రాల్లో తగ్గుదల నమోదైంది. ఏపీలో 2019–21 సర్వేతో పోల్చితే 2023–24 నాటికి బాల్య వివాహాలు 4.2 శాతం తగ్గాయి. జాతీయ స్థాయిలో 2019–21తో సర్వేతో పోల్చితే 2023–24లో బాల్య వివాహాలు 3.2 శాతం తగ్గాయి. ప్రధాన రాష్ట్రాల్లో మహిళల బాల్య వివాహాలు ఇలా.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement