ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత: ముఖేష్‌ కుమార్‌ మీనా | Mukesh Kumar Meena Made Aware About Vote To New Voters | Sakshi
Sakshi News home page

ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత: ముఖేష్‌ కుమార్‌ మీనా

Apr 27 2024 9:04 AM | Updated on Apr 27 2024 9:04 AM

Mukesh Kumar Meena Made Aware About Vote To New Voters

సాక్షి, గుంటూరు: ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా. ‌దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు హక్కుకు ఉందని వ్యాఖ్యలు చేశారు. 

కాగా, గుంటూరులో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారికి అవగాహన కార్యక్రమంలో భాగంగా అధికారులు 3k రన్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ..‘ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా‌. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు హక్కుకు ఉంది. దేశ భవిష్యత్తే యువత‌.

యువత ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది‌. తుది ఓటర్ జాబితా తయారీ చేయడంలో చాలా ఇబ్బందులుంటాయి. ‌యువత ఎప్పటికప్పుడు మొదటి సారి ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాం‌ము. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. ‌20 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 68 శాతం కంటే తక్కువగా ఉంటుంది. అర్బన్ నియోజకవర్గాల్లోనే తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది. ప్రతీ ఒక్కరు ఓటు వేయాలి’ అని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement