సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు.
‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు.
రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్‌ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా.
రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.


