‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్‌ | Chandrababu Govt Backtracks On Land Allocation For Lulu Mall | Sakshi
Sakshi News home page

‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్‌

Apr 8 2026 6:34 PM | Updated on Apr 8 2026 7:23 PM

Chandrababu Govt Backtracks On Land Allocation For Lulu Mall

సాక్షి, విజయవాడ: విజయవాడలో లూలు మాల్‌కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్‌కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

కాగా, విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

అయితే, లులుకి భూములు కట్టబెట్టడంపై ఆర్టీసి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో లులు అద్బుతం అంటూ చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. హైకోర్టులో నేడు లులు మాల్‌కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement