‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’ | Ysrcp Gadikota Srikanth Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’

Apr 8 2026 4:30 PM | Updated on Apr 8 2026 4:54 PM

Ysrcp Gadikota Srikanth Reddy Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ చొరవతోనే రాయలసీమకు సాగునీరు అందిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటూ దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు  వచ్చాయంటే దానికి కారణం వైఎస్సారేనని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

‘‘హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా?. రాయలసీమకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నింట్లోను రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంను 100 టీఎంసీలకు పెంచి రాయలసీమ గొంతు కొస్తున్నారు. అయినా చంద్రబాబు ఆల్మట్టి  ఎత్తుపై స్పందించడం లేదు’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘వైఎస్ కుటుంబం వలనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి జరిగింది. హంద్రీనీవా, సుజల‌ స్రవంతి ప్రాజెక్టును తెచ్చింది వైఎస్సారే. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు. కరువు ప్రాంతంలో చెరువులలో నీళ్లు ఉన్నాయంటే వైఎస్సారే కారణం. వైఎస్సార్‌, జగన్‌ల వలనే రాయలసీమకు మేలు జరిగింది. కానీ అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు వలన చివరికి వెంకటేశ్వరస్వామికి కూడా నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అయినా ఆయన నోరెత్తటం లేదు

..రాయలసీమ లిఫ్టును సైతం నిలిపేసి చంద్రబాబు తన విద్వేషాన్ని బయట పెట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు. తన బినామీలకు దోచి పెడుతున్నారు. అమరావతిని అవినీతికి రాజధానిని చేశారు. కొత్త సిటీల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?. జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారు?. నయా రాయపూర్‌లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని వేల కోట్ల ఖర్చు చేసినా అభివృద్ధి లేదు. అలాంటిది ఇక అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు పోస్తారు?. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్‌.. చంద్రబాబుకు జాకీలు ఎత్తు తున్నారు

..లక్షల కోట్లు అమరావతిలో పెడితే మా రాయలసీమ పరిస్థితి ఏంటి?. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా ఆపేశారు. మా దగ్గర వసూలు చేసే పన్ను అమరావతిలో ఖర్చు చేస్తే మరి మా పరిస్థితి ఏంటి?. భూమి, ఇసుక ఫ్రీగా ఇస్తున్నా కూడా రూ.16 వేల వరకు అడుగుకు ఖర్చు పెడుతుంటే అడగవద్దా?. నీళ్లు తోడటానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన పనిలేదు. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులోకి దూరి హల్‌చల్ చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. ఇదేనా పరిపాలన?’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement