అమ్మ రాసిన మరణ శాసనం | Mother And Childrens Incident In Srikakulam | Sakshi
Sakshi News home page

అమ్మ రాసిన మరణ శాసనం

Oct 7 2026 7:46 AM | Updated on Oct 7 2026 7:47 AM

 Mother And Childrens Incident In Srikakulam

మృతి చెందిన తల్లీబిడ్డలు మీన, కులదీప్‌

శ్రీకాకుళం: చిలకపాలెం కన్నీరు పెట్టింది. ఓ తల్లి తన బిడ్డల పాలిట రాసిన మరణ శాసనం ఊరిని ఉలిక్కిపడేలా చేసింది. మతిస్థిమితం సరిగా లేని కారణంగా అమ్మ చేసిన పని బిడ్డ ఉసురు తీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 

మండలంలోని చిలకపాలెం గ్రామానికి చెందిన తొణంగా మీన (శారద) (29), జగదీష్‌ దంపతులు. వీరికి ఏడు నెలల వయసు గల కులదీప్, మూడేళ్ల వయసు గల గాయత్రి అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మీన చాలాకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. కలలు రావడం, నిద్ర పట్టకపోవడం, తనకు ఏదో జరిగిపోతోందని భ్రమపడడం వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే ఓ ఆర్‌ఎంపీ వద్ద కు తీసుకెళ్లి చూపించారు. కానీ ఆమె సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మంగళవారం వేకువజామున ఆమె ఈ మానసిక వేదన తట్టుకోలేక ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగేయడంతో పాటు ఇద్దరు బిడ్డలకు కూడా ఇచ్చేశారు. 

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కానీ ముందు బాబు కులదీప్‌ ఊపిరి వదిలేయగా.. తర్వాత 4 గంటల సమయంలో తల్లి మీన కూడా మృతి చెందారు. పాప గాయత్రి చికిత్స పొందుతోంది. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి స్వగ్రామం హిరమండలం వద్ద కొండ రాగోలు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement