టీడీపీ టెర్రరిస్ట్‌ పార్టీలా మారింది: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Comments On Chandrababu In Krishna | Sakshi
Sakshi News home page

టీడీపీ టెర్రరిస్ట్‌ పార్టీలా మారింది: మంత్రి బొత్స

Oct 21 2021 11:30 AM | Updated on Oct 21 2021 11:55 AM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu In Krishna - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని  మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ టెర్రరిస్ట్‌ పార్టీలా మారిందన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబు కారణం కాదా? విమర్శించారు. రాజకీయాల్లో ఇలా తిట్టడం గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. చంద్రబాబు చరిత్ర మొత్తం కుట్రలమయమేనని అన్నారు. ఎన్‌టీఆర్‌ను గద్దెదింపటానికి బాబు ఏంచేశారో అందరికీ తెలుసని మంత్రి బొత్స అన్నారు. టీడీపీని ఏపీలో నిషేధించాలని డిమాండ్‌ చేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.

చదవండి: చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని

Advertisement
 
Advertisement
Advertisement