ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు | Kuchipudi Pathaka Swarnotsavalu started | Sakshi
Sakshi News home page

ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు

Dec 28 2024 5:32 AM | Updated on Dec 28 2024 5:32 AM

Kuchipudi Pathaka Swarnotsavalu started

మూడురోజులు సాగనున్న ఉత్సవాలు.. దేశ, విదేశాల నుంచి కళాకారులు  

కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్ధేంద్ర యోగి కూచి­పూడి కళాపీఠం, కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్‌ సొసైటీ సంయుక్త నిర్వహణలో శుక్రవారం కృష్ణాజిల్లా కూచిపూడిలోని వేదాంతం రత్తయ్యశర్మ వేదికపై కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు జరగనున్నాయి. 

మొదటిరోజు హైదరాబాద్, వరంగల్, కూచిపూడి, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, రష్యా, ప్యారిస్, యూఎస్‌ఏ కళాకారులు ప్రదర్శించిన పలు అంశాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 

ముందుగా గ్రామ సర్పంచ్‌ కొండవీటి వెంకట రమణ విజయలక్ష్మి, నాట్యాచార్యులు వేదాంతం వెంకట రామ రాఘవయ్య, పసుమర్తి శేషుబాబు, ఏలేశ్వరపు చలపతి శాస్త్రి, మాధవపెద్ది మూర్తి, సీతా కుమారి, డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ, డాక్టర్‌ ఏలేశ్వరపు శ్రీనివాసులు, డాక్టర్‌ పసుమర్తి వెంకటేశ్వర శర్మ, వనజా ఉదయ్‌లతోపాటు పలువురు నాట్యాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను     ప్రారంభించారు. 

ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.. 
నాట్యాంశాల్లో తొలిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి నాట్యకళాపీఠం విద్యార్థులు పూజా నృత్యంతో ప్రదర్శనలను ప్రారంభించారు. డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ శిష్య బృందం మోహినీ భస్మాసుర నృత్య రూపకం ప్రదర్శించారు. 

రష్యాకు చెందిన పుట్టు పద్మ రాగిణి, న్యూఢిల్లీకి చెందిన అభినయ నాగ జ్యోతి, వరంగల్‌కు చెందిన సు«దీర్‌ రావు శిష్య బృందం, యూఎస్‌ఏకు చెందిన అమేయ కింగ్, అయోస్ల, అవ్వారి మనస్విని, ప్రణమ్య సూరి, బెంగళూరుకు చెందిన సామా కృష్ణ, అనురాధ, మంజుల, అవిజిత్‌ దాస్, డాక్టర్‌ వీణ మూర్తి విజయ్, హైదరాబాద్‌కు చెందిన  ప్రొఫెసర్‌ పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్య బృందం, డాక్టర్‌ శ్రీకళ శిష్య బృందం, నాట్యరత్న రమణి సిద్ధి, చెన్నైకు చెందిన ఎం కిశోర్, శోభ ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్ష­కులను అలరించాయి. 

నాట్య ప్రద­ర్శనలు నిర్వహించిన గురువులను, కళాకారుల­ను నిర్వాహకులు  సత్కరించారు.  కూచిపూడిలోని పురవీధుల్లో ఉదయం నగర సంకీర్తన, విద్యార్థులకు నాట్య శిక్షణ, అనంతరం నాట్య సదస్సులు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement