ఈరోజు ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుంది   | Kodali Nani Comments On Chandrababu Naidu Remnad | Sakshi
Sakshi News home page

ఈరోజు ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుంది  

Sep 10 2023 8:19 PM | Updated on Sep 10 2023 9:25 PM

Kodali Nani Comments On Chandrababu Naidu Remnad - Sakshi

కృష్ణా జిల్లా, గుడివాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో  చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు అన్న ఎన్టీఆర్  గారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన విగ్రహాల నుండి ఆనందభాష్పాలు వస్తున్నాయన్నారు.   

ఆదివారం విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌లోని ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం హైడ్రామా మధ్య చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తీర్పును వెలువరించింది. చంద్రబాబు నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలుపుతూ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 

కొడాలి నాని మాట్లాడుతూ.. నన్నెవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్న చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి ఆత్మకు శాంతి కలుగుతుందని ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుండి ఆనందభాష్పాలు వస్తున్నాయని అన్నారు. లక్షల మంది పిల్లల సొమ్మును పందికొక్కులా దోచుకుని చంద్రబాబు లోకేష్‌కు ధారాదత్తం చేశాడన్నారు.

చంద్రబాబు తనలోని దొంగ స్కిల్స్ అన్నిటినీ ఉపయోగించి స్కిల్ డెవలప్మెంట్ సొమ్మును దోచుకున్నాడని చెబుతూ చంద్రబాబును  జైలు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని లోకేష్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలన్నారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్, వైయస్సార్ అభిమానిగా ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. 

74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌కు క్షోభ పెట్టిన చంద్రబాబు, అదే వయసులో జైలుకెళ్తున్నాడన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారని దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరుపితమైందన్నారు. ఎన్నికలవేళ సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా అవినీతిపరుడు చంద్రబాబుపై సీఎం జగన్ దర్యాప్తు చేయించారని, ఎవరు అవినీతికి పాల్పడినా ఉక్కుపాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారన్నారు. 

శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఉత్త పుత్రుడు కష్టపడుతుంటే తాను వెనకబడిపోతాననే భయంతో  హడావిడిగా  బయలుదేరాడు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి హైడ్రామా చేశాడు. రోడ్డుపై దేక్కుంటూ అయినా సరే చంద్రబాబు కాళ్ల వద్దకు రావాలన్నదే పవన్ తాపత్రయమన్నారు. పవన్ కళ్యాణ్ లీగల్ గా చంద్రబాబుకు దత్తత అయ్యి, కుటుంబ సభ్యుడిగా కోర్టుకు వెళ్లి కలుసుకుంటే బాగుండేదన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement