ఏపీలో జూడాల సమ్మె ఉధృతం.. అత్యవసర సేవలు బంద్‌ | Junior Doctors Strike In AP Emergency Services Stop Today | Sakshi
Sakshi News home page

ఏపీలో జూడాల సమ్మె ఉధృతం.. అత్యవసర సేవలు బంద్‌

Aug 17 2026 7:20 AM | Updated on Aug 17 2026 7:27 AM

Junior Doctors Strike In AP Emergency Services Stop Today

సాక్షి, అమరావతి: ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన మరింత ఉధృతం కానుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే పలు దశల్లో నిరసనలు చేపట్టిన జూనియర్ డాక్టర్లు.. నేటి నుంచి మూడో దశ ఆందోళనలకు సిద్ధమయ్యారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని వారు ప్రకటించారు.

ఇప్పటివరకు ఓపీ, సాధారణ వైద్య సేవలకు మాత్రమే పరిమితమైన ఆందోళన.. ఇకపై అత్యవసర సేవలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలు నిలిచిపోతే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement