జనసేన నేతలకు షూ చూపించిన జడ శ్రవణ్ | jada sravan kumar dare to pawan kalyan and janasena | Sakshi
Sakshi News home page

తిక్క రేగితే జనసేన పార్టీ ఆఫీస్‌కి వస్తా: జడ శ్రావణ్

Nov 1 2025 2:31 PM | Updated on Nov 1 2025 2:57 PM

jada sravan kumar dare to pawan kalyan and janasena

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్నారులపై ఆకృత్యాలు పెరిగిపోయాయ‌ని  జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ (jada sravan kumar) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విజయవాడలో శ‌నివారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్టాడుతూ.. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై దారుణానికి పాల్ప‌డిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ)పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

జనసేన నేత ఆత్మహత్య చేసుకుంటాడా?
హోంమంత్రి అనిత (Home Minister Anitha) ప్రతాపం అంతా ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల మీద చూపిస్తున్నార‌ని.. అగ్ర‌వ‌ర్ణాల వారు త‌ప్పు చేస్తే ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. కోనసీమ ఘటన అధికార పత్రికల్లో రాలేదు కాబట్టి పట్టించుకోరా అంటూ ప్ర‌శ్నించారు. 'తుని ఘటనలో టీడీపీ నేత నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నట్లు.. జనసేన నేత ఆత్మహత్య చేసుకుంటాడా?, నారాయణ ఎస్పీ కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాడా?, జనసేన నేత పవన్ క్యాస్ట్ కాబట్టి ఆత్మహత్య చేసుకోడా? కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేన నేతను జైలుకు తీసుకెళ్లి సకల సౌకర్యాలు కల్పిస్తారా? హోంమంత్రి సమాధానం చెప్పాల'ని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.

పవన్ క‌ళ్యాణ్ ఎందుకు మౌనం
ఆడపిల్లల ప‌ట్ల అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించిన వారి తాట తీస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని నిల‌దీశారు. క‌నిపించ‌కుండా పోయిన 30 వేల మంది మ‌హిళ‌ల‌ను 30 రోజుల్లో తీసుకుని వస్తామని చెప్పారు. 16 నెలలు అయినా ఒక్క అమ్మాయిని తీసుకుని రాలేదని అడిగారు. బాధితుల‌ను హ‌త్తుకున్న‌ట్టు న‌టించి.. డబ్బులు తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకుంటారా అని ప్ర‌శ్నించారు.

వారిని షూతో కొట్టొచ్చా?
జ‌న‌సేన పార్టీ (Janasena Party) అధికారికంగా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసింది కాబ‌ట్టి స్పందిస్తున్నాన‌ని తెలిపారు. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లపై చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ''జనసేన పార్టీ కార్యాలయానికి చర్చకు వస్తాను. మీరు సిద్దమా? చర్చకు నేను ఒక్కడినే వస్తాను.. టైం పవన్ చెప్పాలి. దమ్ముదైర్యం ఉంటే టైం చెప్పాలి. 48 గంటలు సమయం జనసేనకి ఇస్తున్నాను. మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతికామెంట్ కౌంట్ చేస్తున్నాం. ప్రతి దానికి సమాధానం చెప్తా. రాజకీయ కామెంట్స్ చేయండి.. కానీ పర్సనల్ కామెంట్స్ చేస్తే చూస్తు ఊరుకోం. వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్నాన‌ని అంటున్న వాళ్లు ఆధారాలు చూపిస్తే రాజ‌కీయాలు వ‌దిలేస్తా. 

గతంలో ప్యాకేజీ స్టార్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊగిపోయి, నోటికొచ్చిన‌ట్టు తిడుతూ చెప్పు చూపించారు. నేను షూ చూపిస్తున్నాను. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేసిన వారిని షూతో కొట్టొచ్చా? చంద్రబాబు, పవన్, లోకేష్ జడ శ్రవణ్‌ను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో చూస్తారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికి పవన్ ప‌నిచేస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మేం పోరాటం చేస్తున్నామ‌''ని జడ శ్రవణ్ అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement