
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడగా.. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపారు. దీంతో రెండు రోజుల పాటు (గురు, శుక్రవారాల్లో) కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.