ఎస్కలేటర్‌లో చిక్కుకున్న బాలిక | Girl Gets Struck In Escalator In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఎస్కలేటర్‌లో చిక్కుకున్న బాలిక

Oct 4 2021 9:11 PM | Updated on Oct 4 2021 9:15 PM

Girl Gets Struck In Escalator In Visakhapatnam - Sakshi

విశాఖ పట్నం: విశాఖ పట్నంలోని ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లిన కుటుంబానికి అనుకోని సంఘటన ఎదురైంది. పై అంతస్థులో షాపింగ్‌ చేయడానికి.. ఎస్కలేటర్‌పై వెళ్తున్న ఒక పాప డ్రెస్సు ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఎస్కలేటర్‌లో ఇరుక్కుంది. దీంతో బాలిక ఎటు కదల్లేక అక్కడే ఉండిపోయింది.

దీంతో వెంటనే ఆ బాలిక తండ్రి షాపింగ్‌మాల్‌ నిర్వాహకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలిక డ్రెస్సును బైటకు తీసి ఎస్కలేటర్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో.. బాలిక క్షేమంగా బయటపడటంతో షాపింగ్‌కు వచ్చిన కస్టమర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. 

చదవండి: Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌ చల్‌

Advertisement
 
Advertisement
Advertisement