సాక్షి, విశాఖపట్నం: ప్రచార ఆర్భాటం తప్ప బీసీలకు టీడీపీ ఏమి చేయలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ (గురువారం) ఆయన వైఎస్సార్‌సీపీ బీసీల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేయడంలో చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు చాలా తేడా ఉందన్నారు. బీసీలను సమాజంలో తలెత్తుకునేలా వైఎస్ జగన్ చేశారన్నారు.
‘‘టీడీపీ నేతలు ఎందుకు చంద్రబాబు మోసాన్ని నిలదీయలేకపోతున్నారు? పుట్టిన ప్రాంతానికి, కులానికి న్యాయం చేయమని టీడీపీ బీసీ నేతలు ఎందుకు అడగడం లేదు? టీడీపీ నేతలు నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నారు. వైఎస్ జగన్ దృష్టిలో బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్. బీసీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు వైఎస్ జగన్ ఇచ్చారు. పార్టీ కమిటీల్లో బీసీలకు పెద్ద పీట వేశారు’’ అని బొత్స వివరించారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునే కుట్ర: అంబటి


