‘చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’ | Fishermen Angered: Chandrababu Fails to Keep His Promise | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’

Mar 23 2026 7:28 PM | Updated on Mar 23 2026 7:47 PM

Fishermen Angered: Chandrababu Fails to Keep His Promise

రాజయ్యపేట మత్స్యకారులు(ఫైల్‌ఫోటో)

అనకాపల్లి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాజయ్యపేట మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చంద్రబాబు నిలువునా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. రాజయ్యపేటలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ నిర్మాణం జరగదని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకోలేదని విమర్శించారు. 

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దని 76 రోజుల పాటు ఉద్యమం చేశామని,  బల్క్‌ డ్రగ్‌ పార్క‌పై చంద్రబాబు ప్రకటన చేయాలన్నారు. తమకు చంద్రబాబు హామీ ఇచ్చి 93 రోజులైందని, అయినా  ఇప్పటికీ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌పై చంద్రబాబు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు మత్స్యకారులు. 

Advertisement
 
Advertisement
Advertisement