అనకాపల్లి: జిల్లాలోని వడ్డాదిలో పిచ్చికుక్క స్వైర విహారం స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఆ పిచ్చికుక్క దెబ్బకు గ్రామస్తులు హడలిపోతున్నారు. ఈరోజు(బుధవారం) పిచ్చికుక్క స్వైర విహారం చేసి 30 మందిని కరిచింది. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారంతా వృద్ధులు, చిన్నారులే ఉన్నారు.
వీరిని చోడవరం, కేజే పురం ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క దాడిలో గాయపడిన వారికి రేబీస్ వాక్సిన్ వేశారు వైద్యులు. అయితే ఆ పిచ్చి కుక్క మళ్లీ ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్తుల్లో భయం నెలకొంది.


