అన్ని శాఖలకు తల్లి.. రెవెన్యూ శాఖ | Dharmana Prasada Rao comments about Department of Revenue | Sakshi
Sakshi News home page

అన్ని శాఖలకు తల్లి.. రెవెన్యూ శాఖ

Apr 28 2022 4:14 AM | Updated on Apr 28 2022 7:54 AM

Dharmana Prasada Rao comments about Department of Revenue - Sakshi

సాక్షి, అమరావతి: అన్ని శాఖలకూ రెవెన్యూ శాఖ తల్లి వంటిదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కొత్త కార్యాలయాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన ప్రారంభించారు.

కార్యక్రమంలో సీసీఎల్‌ఏ కార్యదర్శి ఎ.బాబు, సంయుక్త కార్యదర్శులు గణేష్‌కుమార్, తేజ్‌ భరత్, సీఎంఆర్‌వో (కంప్యూటరైజేషన్‌ ఆఫ్‌ ఎంఆర్‌వో ఆఫీసెస్‌) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు మంత్రి ధర్మాన ప్రసాదరావును సన్మానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement