చంద్రబాబు గో బ్యాక్ అంటూ దళిత సంఘాల నినాదాలు

Dalit Groups Attempt To Resist Chandrababu Gollapudi Visit At Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమాకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

చంద్రబాబు గో బ్యాక్ అంటూ దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు.  దళితులు భారీగా గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబును అడ్డుకోవాడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు దళిత సంఘాలను అడ్డుకున్నాయి. అనంతరం దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. పదిహేనేళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమా దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. కావాలనే దళితుల పేరు చెప్పుకుని చంద్రబాబు కుళ్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దేవినేని ఉమా ఇప్పటికైనా దళితులపై చేస్తున్న కుట్ర రాజకీయం మానుకొవాలన్నారు. లేనిపక్షంలో మళ్లీ ప్రజాక్షేత్రంలో టీడీపీకి బుద్ధి చెబుతామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top