సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు | Cm Jagan Orders Take Steps To Save Telugu People Trapped In Sudan | Sakshi
Sakshi News home page

సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Apr 25 2023 9:41 PM | Updated on Apr 25 2023 9:44 PM

Cm Jagan Orders Take Steps To Save Telugu People Trapped In Sudan - Sakshi

అంతర్యుద్ధం కారణంగా సుడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సాక్షి, అమరావతి: అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఉక్రెయిన్‌ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే.. వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్‌ చేసుకుని అక్కడ నుంచి స్వస్థలాలకు చేరుకునే వరుకు కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు.
చదవండి: సునీత అక్క స్టేట్‌మెంట్‌లో పలు అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement