రాజకీయ రాబందు.. అవినీతి చంద్రిక | Chandrababu Naidu Corruption Allegations NTR Daggubati Book Claims | Sakshi
Sakshi News home page

రాజకీయ రాబందు.. అవినీతి చంద్రిక

Apr 15 2026 7:52 AM | Updated on Apr 15 2026 8:02 AM

Chandrababu Naidu Corruption Allegations NTR Daggubati Book Claims

ఇదీ చంద్రబాబు నిజ స్వరూపం 

ఆనాడే కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్, దగ్గుబాటి 

సాక్షి, అమరావతి: రావణుడి గుట్టు విభీషణుడికి తెలుసు అన్నట్టు.. తెలుగు రాజకీయ రావణుడు చంద్రబాబు గుట్టు, గూడుపుఠాణి అంతా ఆయన సొంత కుటుంబ సభ్యుల కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది...! అందుకే చంద్రబాబు అవినీతి చరిత్ర, రాజకీయ కుట్రల గురించి ఆయనకు సొంత మామ ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎనాడో సవివరంగా వెల్లడించారు. 1995లో వైస్రాయ్‌ హోటల్‌ కుట్ర అనంతరం ఎన్టీ రామారావు ఆనాడు ఓ టీవీ చానల్‌ నిర్వహించిన చర్చా గోష్టిలో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ నైచ్యాన్ని ఎండగట్టారు. 

చంద్రబాబును ఏకంగా ‘గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం’అని దుయ్యబట్టారు. తెలుగు చరిత్రలో అభినవ ఔరంగజేబ్‌ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు కుతంత్రాల చరిత్ర మాటలతో చెప్పడం సాధ్యం కాదని చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారు. అందుకే ‘ఒక చరిత్ర.. కొన్ని నిజాలు’ శీర్షికతో ఓ పుస్తకమే రాశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, అవినీతి గురించి సోదాహరణంగా ఎండగట్టారు. ఎన్టీ రామారావు ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి చేసిన విమర్శలనూ ఆ పుస్తకంలోనే  ప్రస్తావించారు.  

చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక చరిత్ర – కొన్ని నిజాలు పుస్తకంలోని కొన్ని భాగాలు ఇవీ... 

ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకంలోని అంశాలు సంక్షిప్తంగా.. 
కాంగ్రెస్‌లో ఉండగానే అవినీతికి శ్రీకారం
చంద్రబాబు కాంగ్రెస్‌ పారీ్టలో ఉండగానే అవినీతికి పాల్పడ్డారు. అసలు మంత్రి పదవి కోసమే చేయరాని పనులు చేశారు. మద్రాసులోని సవేరా హోటల్‌లో ఎన్నో చెప్పలేని, చేయరాని పనులు చేశారు. ఇక మంత్రి అయిన తరువాత అవినీతికి బరితెగించారు. ఆయనకు టార్చ్‌లైట్‌ మినిస్టర్‌ అని ఆనాడే ముద్ర వేశారు. అంటే రాత్రి వేళల్లో టార్చ్‌లైట్లతో పనులను తనిఖీ చేస్తున్నట్టు హడావుడి చేసి కాంట్రాక్టర్లను బెదిరించేవారు. అనంతరం వారి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసేవారు.  

ఎన్టీఆర్ గ్లామర్‌కు ఐదు శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా 
సీనీ రంగంలో ఉన్న ఎనీ్టరామారావు 1982లో టీడీపీని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు ఆయన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న ఆయన తాను టీడీపీలో చేరనని ప్రకటించారు. అంతేకాదు ఎన్టీ రామారావు తిరుపతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే చంద్రబాబు ఆయన్ని ఎగతాళి చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ ఆదేశిస్తే సొంత మామ అయినా ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానన్నారు. చంద్రబాబును టీడీపీలో చేరాలని కోరినప్పుడు ఎద్దేవా చేశారు. కాగితాలపై ఏవేవో లెక్కలు వేసి ఎన్టీ రామారావు సినీ గ్లామర్‌కు ఐదు శాతం ఓట్లు రాలవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు చేతి నుంచి పైసా కూడా తీయరని కూడా హేళన చేశారు. అటువంటి ఎన్టీ రామారావు పార్టీని నడపలేరని వ్యాఖ్యానించారు.  

టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిన చంద్రబాబు 
1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచి్చంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. సిట్టింగ్‌ మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబూ ఓడిపోయారు. దాంతో ఆయన వెంటనే ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌ పారీ్టకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతానన్నారు. చంద్రబాబును పారీ్టలో చేర్చుకోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే ఎన్టీ రామారావు పార్టీ నేతలను ఒప్పించి చంద్రబాబు టీడీపీలో చేరికకు సమ్మతించారు.  

టీడీపీలో చేరగానే వసూళ్ల పర్వం 
చంద్రబాబు టీడీపీలో చేరగానే తన నైజాన్ని చూపించారు. మహానాడు, ఇతర పార్టీ కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో భారీగా వసూళ్లు మొదలుపెట్టారు. ఇవన్నీ ఎన్టీ రామారావుకు తెలియకుండానే చేసేవారు. వసూలు చేసిన నిధులను పార్టీ ఖాతాలో జమ చేసేవారు కూడా కాదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా కొనుగోలు  చేసే సామగ్రిలో కూడా చంద్రబాబు కమీషన్లు తీసుకునేవారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తూ టీడీపీలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు.  

ఎనీ్టఆర్‌ కుటుంబ సభ్యులను అణచివేసిన చంద్రబాబు  
ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు టీడీపీలో రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు అణచివేశారు. హరికృష్ణను తన వారసుడిగా చేయాలని ఎన్టీ రామారావు భావించారు. దాంతో హరికృష్ణను పార్టీ కార్యక్రమాలకు చాకచక్యంగా దూరం చేశారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ ఎదుగదలను అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడ్డారు. 1986లో మదనపల్లి సభలో ఎన్టీ రామారావు బాలకృష్ణను తన వారసుడిగా ప్రకటించారు. దాంతో చంద్రబాబు ఎన్టీ రామారావుపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనకు ఆయనతోనే ఖండన ఇప్పించారు.  

బరితెగించి దోపిడీ
ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు.  మద్యం బాట్లింగ్‌ ప్లాంట్ల లైసెన్సుల వ్యవహారంలో చంద్రబాబు అవినీతి విస్మయపరిచింది. తమిళనాడుకు చెందిన పురుషోత్తం అనే కాంట్రాక్టరు ఉన్న తాజ్‌ బంజారా హోటల్‌కు తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. ఆయన నుంచి రూ.3కోట్లను గోతం సంచులలో వేసుకుని తెచ్చుకున్నారు. ఆ విధంగా కాంట్రాక్టులు ఇప్పిస్తామని భారీగా కమీషన్లు తీసుకునే సంస్కృతి టీడీపీలోకి తెచి్చంది చంద్రబాబే. ఇక 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది.

 చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారు. కమీషన్లు తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాశారు. శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ శాసనసభలో నిలదీసింది. దాంతో ఆ ప్రాజెక్టు ఫైళ్లను ప్రతిపక్ష నేతలు స్పీకర్‌ కార్యాలయంలో పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతిపక్ష టీడీపీ తరపున చంద్రబాబు స్పీకర్‌ కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని పత్రికలకు తెలిపారు. విషయం ఏమిటంటే... శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తం చంద్ర­బాబుకు కమీషన్‌గా సమర్పించారు. ఆ విషయం తెలిసీ ఎన్టీ రామారావు చంద్రబాబుకు చెప్పరాని విధంగా చివాట్లు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నారని ... అమ్మేస్తున్నారని కడిగిపారేశారు.  

వైస్రాయ్‌ కుట్ర.. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు 
ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు మనుషులు
1994లో టీడీపీ అఖండ మెజారీ్టతో అధికారంలోకి వచి్చనప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు.  1995 ఆగస్టులో వైస్రాయ్‌ హోటల్‌ కుట్రకు తెరతీశారు. ఆ రోజు వైస్రాయ్‌ హోటల్‌కు వచ్చిన ఎన్టీ రామారావుపై చంద్రబాబు మనుషులు చెప్పులు విసిరారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ మనోవేదనతో ఎన్టీ రామారావు మరణించారు. అనంతరం టీడీపీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీ రామారావు బొమ్మలు తీయించి వేశారు. ‘ఇంకా ఎన్నాళ్లు ఎన్టీఆర్ బొమ్మ పట్టుకుని పాకులాడతాం... ఎనీ్టఆర్‌ బొమ్మ పోవాలి.. మన బొమ్మ రావాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారు.  

అవినీతి చక్రవర్తి చంద్రబాబు 
ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు అవినీతి మరింత పెచ్చుమీరింది. ఏలేరు భూముల నష్టపరిహారం కుంభకోణం, లిక్కర్‌ అమ్మకాల్లో ముడుపులు, బిల్లీరావు ప్రమేయం ఐఎంజీ అనే బోగస్‌ సంస్థకు హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వేయిఎకరాలను ఎకరా రూ.25 వేల చొప్పున కట్టబెట్టడం, ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు ఇలా బరితెగించి అవినీతికి పాల్పడ్డారు.   

ఎన్టీ రామారావు
‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్‌ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్‌ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డు కన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం.  

ఎమ్మెల్యేలు అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆయన పేరు చెప్పడం లేదు. పేరు చెప్పడానికి కూడా అర్హుడు కాదు.  

దేవుడు కూడా క్షమించనంత ఘాతుకం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జాతి, చరిత్ర ఎప్పటికీ విస్మరించదు. మీరే న్యాయ నిర్ణేతలు.   

Advertisement
 
Advertisement
Advertisement