అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం | Chandrababu Cabinet Approves Another Extravagance In Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం

Apr 30 2026 5:36 PM | Updated on Apr 30 2026 6:55 PM

Chandrababu Cabinet Approves Another Extravagance In Amaravati

సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.

తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్‌.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం
అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

టీడీపీ ఆఫీస్‌లకు భూముల కేటాయింపు
ఏపీలో టీడీపీ ఆఫీస్‌లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్‌లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి  1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement