అనుభవం ఉంటే సరిపోదు..  నలుగురికి ఉపయోగపడాలి: మంత్రి బొత్స

Botsa Satyanarayana Fires on Chandrababu Over Byjus Agreement - Sakshi

సాక్షి, తాడేపల్లి: దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. బైజూస్‌పై చంద్రబాబు అవహేళనగా మాట్లాడారు. బైజూస్‌ సంస్థ గురించి చంద్రబాబుకు తెలుసా​?. మీ అబ్బాయిని ఇంగ్లీష్‌ మీడియంలో ఎందుకు చదివించారు?. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి. పేదలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొద్దా?. అనుభవం ఉంటే సరిపోదు..  నలుగురికి ఉపయోగపడాలి. బైజూస్‌ ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా?. డిబేట్‌కు ఎవరు వస్తారో రండి.. మేం సిద్ధంగా ఉన్నాం. 35 లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌తో ఉపయోగం. చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని మంత్రి బొత్స అన్నారు. 

''సామాజికి న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. వైఎస్సార్‌ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగింది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబులా మేం ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలేదు. నాడు- నేడు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థుల శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారని'' మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

చదవండి: (చంద్రబాబు పర్యటనలో.. తమ్ముళ్ల వర్గపోరు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top