సీఎంను కలిసిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈడీ

Bank Of Baroda ED Vikramaditya Singh Meets CM YS Jagan - Sakshi

సాక్షి,అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను బ్యాంకు ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ముంబై) విక్రమాదిత్య సింగ్‌ కిచి గురువారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రగతికి తమవంతు కృషి చేస్తామని విక్రమాదిత్య సింగ్‌ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటిం టికీ రేషన్‌ అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ప్రారంభించిన 9,260 కమర్షియల్‌ వాహనాలకు అవసరమైన రుణాలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అందించినట్లు తెలిపారు. బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ మన్‌మోహన్‌ గుప్తా (హైదరాబాద్‌) మాట్లాడుతూ..సాంకేతికను సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు విభిన్నమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో బ్యాంక్‌ విజయవాడ రీజనల్‌ మేనేజర్‌ ఠాకూర్, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ ఎం.విద్యాసాగర్, డీజీఎం సీహెచ్‌ రాజశేఖర్‌ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top