AP: అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు | Assembly sessions are for five days | Sakshi
Sakshi News home page

AP: అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు

Jul 23 2024 5:16 AM | Updated on Jul 23 2024 6:02 AM

Assembly sessions are for five days

బీఏసీ సమావేశంలో నిర్ణయం

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే ప్రతిపాదనపై చర్చ లేదు!

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు నిర్వహించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. 

మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగంతో సభ వాయిదా పడిన నేపథ్యంలో మిగిలిన నాలుగు రోజులు సభ ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. రెండో రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మూడు రోజులు పలు బిల్లులు ప్రవేశపెట్టాలని, మూడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే ప్రతిపాదన ఏదీ ఈ సమావేశంలో చర్చకు రాలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement