అవినాశ్, భాస్కర్‌రెడ్డిలను ఇరికించే కుట్ర

Arguments of YS Bhaskar Reddy's lawyer in Telangana High Court - Sakshi

వైఎస్‌ వివేకా హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారు

టీడీపీ నేతలు, వైఎస్‌ సునీత కథ నడిపిస్తున్నారు

వారికి దర్యాప్తు అధికారి కూడా సహకరించారు

సాక్ష్యాలు, ఆధారాలను పట్టించుకోకుండా విచారణ

 తెలంగాణ హైకోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి న్యాయవాది వాదనలు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ నేత­లు, వైఎస్‌ సునీత కలసి తప్పుదారి పట్టి­స్తు­న్నారని, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలను కేసు­లో ఇరికించేందుకు కుట్ర సా­గు­తోందని భాస్కర్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.­ని­రంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలి­పారు. టీడీపీ నేతలు, సునీతకు సీబీఐ దర్యాప్తు అధికారి కూడా పూర్తిగా సహకరించారని చెప్పారు. దర్యాప్తు సరిగా చేయడం లేదని భావించిన సుప్రీంకోర్టు ఆ అధికారిని విచారణ నుంచి త­ప్పిం­చిందని వివరించా­రు. ప్రత్యక్ష సాక్షులను, ఆధా­రాలను పట్టిం­చుకో­కుం­డా దస్తగిరి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నా­రన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు దస్తగి­రి­ని అప్రూవర్‌గా ప్రకటించినా, బెయిల్‌ ఇచ్చినా సునీత మౌ­నం­గా ఉండటం వెనుక కుట్ర దాగి ఉందని వెల్లడించారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ చెప్పినట్లు ఏ–4 దస్తగి­రి వాంగ్మూలం ఇచ్చా­డు. దాని ఆధారంగా నన్ను, మరికొందరిని నిం­­ది­తులుగా చేర్చే అవ­కా­శం ఉంది. దస్తగిరిని అప్రూ­వర్‌గా ప్రకటించడాన్ని, అతనికి బెయిల్‌ ఇస్తూ కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నింది­తు­లుగా చేర్చవద్దని ఆదే­శాలివ్వాలి’ అని కోరుతూ భా­స్క­ర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ సురేందర్‌ మంగళవారం విచారణ చేపట్టారు.

పిటి­షనర్‌ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హత్య కేసులో నిందితు­డైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్‌ ఇవ్వకూ­డదని సుప్రీం కోర్టు పలు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారి­న దస్త­గిరి వాంగ్మూలంలో చెప్పిన వాటికి సాక్ష్యం లేదు. ఇలా ఎ­లాంటి సాక్ష్యం లేకుండా ఒకరు చెప్పా­రంటూ వ్యక్తులను నే­రంలోకి నెట్టడం చట్టవ్యతిరేకం. నేరంలో నలుగురు పాలు­పంచుకున్నారు. వీరిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా, కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్‌ ఇచ్చారు. దస్తగిరిని కస్టడీలోకి తీసుకోలేదు. విచార­ణా జరప­లేదు.

గంగిరెడ్డి ఆదేశాల మేరకు దస్తగిరి హత్యలో కీలక పా­త్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకు­న్నా­డు. అతని వద్ద కొంత నగదు కూడా దొరికింది. ఆ­యు­ధాన్ని అతనే తెచ్చినట్లు,  హత్యలో ప్రధాన పాత్ర పోషిం­చి­న­ట్లు కూ­డా ఒప్పుకున్నాడు. ఇంత చేసినా అతన్ని అప్రూ­వర్‌గా ప్రక­టించేలా కడప కోర్టులో సీబీఐ కౌంటర్‌ వేసింది. 2021 ఆగ­స్టులో అనుకూల వాంగ్మూలం ఇచ్చిన కారణంగానే అక్టో­బర్‌లో బెయిల్‌కు సీబీఐ సహకరించింది.

మన వెనుక అవి­నాశ్, భాస్కర్‌రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ చెబుతోంది. అసలు ఎవరి పేర్లూ చెప్పలేదని గంగిరెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ అంశాన్ని సీబీఐ పరి­గణనలోకి తీ­సు­కోవ­డం­లేదు. వారికి ఏది కావాలో దాన్నే పరి­గణనలోకి తీసుకుని విచారణ చేస్తు్తన్నా­రు. గూ­గు­ల్‌ టేక్‌ అవుట్‌ డేటాను ఆధారంగా చేసుకోవడం సరికాదు’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు.

టీడీపీతో సునీత మిలాఖత్‌
‘వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమా­రుడిని ప్రకటించారు. ఇది మొదటి భార్య, కూతురు సునీత, అల్లుడికి నచ్చ­లే­దు. ఆస్తుల విషయంలోనూ వారి మధ్య తీవ్రమైన మన­స్ప­ర్థలు వచ్చాయి. గంగి­రెడ్డితో వివేకాకు నగదుకు సంబంధిం­­చి­­న విభేదాలు కూడా ఉన్నాయి. అలాగే తన తల్లి­తో వివే­కా అ­స­భ్యకరంగా ప్రవర్తించిన­ట్లు సునీ­ల్‌ యాదవ్‌ చెప్పాడు. ఇలాంటి వివా­దా­ల నేపథ్యంలోనే హత్య జరిగింది. వీటిని కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్‌తో వివేకా సన్నిహితంగా ఉండేవా­రు. ఎన్నికల్లో అవినాశ్‌ విజయం కో­సం ప్రచా­రం కూడా చేశారు.

వివేకా హత్య తర్వా­త ఇదే విష­యాన్ని సునీత కూడా చెప్పారు. టీడీపీతో ఆమె మిలాఖత్‌ అ­యినప్పటి నుంచి మాట మార్చారు. విభేదాలు ఉన్న వారి­ని వదిలిపెట్టి.. సన్నిహి­తులను కేసులో ఇరికించేందుకు పథ­కం సాగుతోంది. దస్తగిరిపై వాచ్‌మేన్‌ రంగన్న చెప్పిన ఆధా­రా­ల­ను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరిని అప్రూవర్‌­గా ప్రక­టిం­చడం చట్టవిరుద్ధం. అతనికి బెయి­ల్‌ ఇచ్చే సమయంలో­నూ అన్ని అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసు­కోలేదు.

బెయిల్‌ చట్టప్రకారం ఇవ్వలేదు కనుక కడప కోర్టు ఉత్తర్వు­ల­ను కొట్టివే­యాలి. దర్యాప్తు అధికా­రులకు అవినాశ్, భాస్కర్‌­రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు హాజరవు­తు­న్నా­రు. భాస్కర్‌రెడ్డి­ని నిందితుడిగా చేర్చ­వద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్‌­రెడ్డి నివేదించారు. వాదనలు వి­న్న న్యా­యమూ­ర్తి.. విచారణను గురువారానికి వాయి­దా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top