బాబుతో కలిసి ఉన్మాదిలా మారిన పవన్‌: మంత్రి అంబటి | Sakshi
Sakshi News home page

బాబుతో కలిసినప్పటి నుంచి పవన్‌ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: మంత్రి అంబటి

Published Sat, Nov 5 2022 5:57 PM

AP Minister Ambati Rambabu Criticized Pawan Kalyan On Demolitions - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇ‍ప్పటం గ్రామంలో పవన్‌ కల్యాణ్‌ ఉన్మాదిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బాలి అన్న ఒక్క మాట ఆయనలోని ఫ్రస్టేషన్‌ను బయటపెడుతోందన్నారు. ఈనాడు రాతలను పట్టుకుని చంద్రబాబు సలహాతో ఇప్పటం వచ్చి రంకెలు వేసి వెళ్ళారని ద్వజమెత్తారు మంత్రి. పవన్‌ కల్యాణ్‌ సభకు స్థలం ఇవ్వడం వల్లే తొలగింపులు జరిగాయనటం పూర్తిగా అవాస్తవమని, సభ పెట్టకముందే గత ఫిబ్రవరిలోనే మార్కింగ్‌ చేశారని స్పష్టం చేశారు. 

‘చంద్రబాబుతో కలిసినప్పటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. ఏ విగ్రహాలను తొలగించలేదు. ఒక్క ఇల్లు కూడా ఎక్కడా పడగొట్టకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విస్తరణ దేశంలో ఎక్కడా జరగలేదా?,  అది రెక్కీ కాదు అని పోలీసులు చెప్పారు. ఇప్పటం ఒక ప్రశాంతమైన గ్రామం, అక్కడ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుపై రాయి వేయటం, పవన్‌పై రెక్కీ అనేవన్నీ అవాస్తవం. పవన్ రాజకీయాలకు పనికి వచ్చే మనిషి కాదు. పవన్ ఫ్యాన్స్‌కి నా మనవి.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదవద్దు. ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని ఇచ్చావా?,  పవన్‌ను నమ్మి వెళితే జీవితాంతం బాధపడతారు. అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలని తెలుసుకోండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా.. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు.’ అని పవన్‌ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. 

ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ టూరిస్టులు: కొడాలి నాని

Advertisement
 

తప్పక చదవండి

Advertisement