61.03 లక్షల మందికి 1 నుంచి పింఛన్లు | Andhra Pradesh: Pension Distribution To More Than 60 Lakhs Elders By Volunteers | Sakshi
Sakshi News home page

Pension Distribution: 61.03 లక్షల మందికి 1 నుంచి పింఛన్లు

Mar 31 2022 8:23 AM | Updated on Mar 31 2022 8:39 AM

Andhra Pradesh: Pension Distribution To More Than 60 Lakhs Elders By Volunteers - Sakshi

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ రెండో తేదీ ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో పింఛనుదారులందరికీ 1న పింఛన్‌ చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,03,530 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల ముందే రూ.1,551.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 1న తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి, సాయంత్రంలోగా కనీసం 90 శాతం మందికి డబ్బులు చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

చదవండి: రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి 

Advertisement
 
Advertisement
Advertisement