ఏపీలో తగ్గని కరోనా ఉదృతి.. కొత్తగా 24,171 కేసులు | Andhra Pradesh Covid Report Of May 2021 | Sakshi
Sakshi News home page

ఏపీలో తగ్గని కరోనా ఉదృతి.. కొత్తగా 24,171 కేసులు

May 16 2021 7:34 PM | Updated on May 16 2021 8:09 PM

Andhra Pradesh Covid Report Of May 2021 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉదృతి కొన‌సాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 94,550 టెస్టులు నిర్వహించగా, కొత్తగా 24,171 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 101 మంది మహమ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 113 కోవిడ్ కేర్ సెంటర్స్‌లో 17 వేల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కొంచం తగ్గిందని, ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నాయని సింఘాల్‌ తెలిపారు. మూడు ప్రాంతాల నుండి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రాష్ట్రానికి ఆక్సిజన్ అందిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement