మోసాలు చేసి పాలన చేయం... ప్రజా సంక్షేమం మా ద్యేయం

Ambati Rambabu Comments Completing Two Years Rule Of YS Jagan In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. '' రేపటికి వైఎస్ జగన్ పరిపాలన ప్రారంభమై 2 ఏళ్ళు విజయవంతంగా పూర్తి అవుతుంది. ఈ రెండేళ్లలో ఇచ్చిన మాటకు కట్టుబడి 95 శాతం వాగ్దానాలను అమల్లోకి తెచ్చారు. రూ. 1.25 లక్షల కోట్లు ప్రజల ఖాతాలోకి అందించిన ఏకైక ప్రభుత్వం మాది. ఒక నాయకుడు మాట ఇస్తే ఇంతగా కట్టుబడి ఉంటాడా అన్నట్లు పాలన సాగింది.  గత ప్రభుత్వాల్లా మేము మోసాలు చేసి పాలన చేయం... ప్రజల సంక్షేమమే మా ద్యేయం.

ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ప్రజల నుంచి నేరుగా సీఎం అయిన వ్యక్తి జగన్.  నాయకుడు ఎలా ఉండాలో దేశమంతా జగన్ వైపు చూస్తుంటే.. నాయకుడంటే ఎలా ఉండకూడదు అనుకునే వాళ్ళు చంద్రబాబు వైపు చూస్తున్నారు . ఓటు వేయని వారుని కూడా ఈ రెండేళ్లలో తన వైపు తిప్పుకున్నారు. ఈ మధ్య ఏ ఎన్నిక జరిగినా విజయం వైఎస్సార్‌సీపీనే వరించింది. ప్రతిపక్షాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఇక టీడీపీకి మిగిలింది బూడిద, జూమ్ మాత్రమే. చంద్రబాబుది ముగిసిన చరిత్ర... ఆయన సినిమా అయిపోయింది.

ఈ రెండేళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం.ఎన్నికల మేనిఫెస్టో అర్థమే మార్చాం. 129 వాగ్దానాలు ఇస్తే 107 పూర్తి చేసాం.. మిగిలినవి అమలు కాబోతున్నాయి . ఒక్క బటన్ తో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి మా సీఎం. ఇలాంటివి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలి...కానీ ఇది సందర్భం కాదు . కోవిడ్ నేపథ్యంలో దానిపై అందరం కలసికట్టుగా పోరాడాలి . క్యాలెండర్ ఇచ్చి ముందుగా చెప్పి మరీ సంక్షేమం అందిస్తున్నారు.'' అని అంబటి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top