భీమిలిలో ఒబెరాయ్‌ గ్రూపునకు 40 ఎకరాలు కేటాయింపు  | Allotment of 40 acres to Oberoi group in Bhimili | Sakshi
Sakshi News home page

భీమిలిలో ఒబెరాయ్‌ గ్రూపునకు 40 ఎకరాలు కేటాయింపు 

Jan 30 2023 6:05 AM | Updated on Jan 30 2023 6:05 AM

Allotment of 40 acres to Oberoi group in Bhimili - Sakshi

స్థలాన్ని చూపిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున. పక్కన విక్రమ్‌ ఒబెరాయ్, రాజారామన్‌ శంకర్‌

తగరపువలస: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీకి లీజ్‌ కమ్‌ రెంట్‌ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ సందర్భంగా ఆ స్థలాన్ని ఆదివారం గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) విక్రమ్‌ ఒబెరాయ్, సంస్థ కార్పొరేట్‌ వ్యవహారాల ప్రెసిడెంట్‌ రాజారామన్‌ శంకర్, ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి కల్లోల్‌ కుందులతో కలిసి కలెక్టర్‌ సందర్శించారు.

రాబోయే రోజుల్లో విశాఖలో జరగనున్న పలు ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జున వారికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మల్‌రెడ్డి, విశాఖ పర్యాటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పాణి, భీమిలి ఆర్డీఓ భాస్కరరెడ్డి, తహసీల్దార్‌ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement