నా పేరుతో మోసాలు: అజేయ కల్లం | Ajeya Kallam Complaint To DGP Over Commits Scam On His Name In Guntur | Sakshi
Sakshi News home page

డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు

Oct 21 2020 4:51 PM | Updated on Oct 21 2020 5:36 PM

Ajeya Kallam Complaint To DGP Over Commits Scam On His Name In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తన పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు ఏపీ సీఎం ప్రధాన సలహాదారు, మాజీ సీఎస్‌ అజేయ కల్లం బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా తన పేరును వాడుకుని జూనియర్‌ లైన్‌మెన్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాట్సప్‌ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డీజీపీని కోరారు. ఒకవేళ విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే వాట్సప్‌ మేసేజ్‌లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, వాటికి కారకులేవరో గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement