వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

● గుమ్మనూరు అనుచరులపై

పోలీసులకు ఫిర్యాదు

పామిడి: వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. పామిడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక 13వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ మారపరెడ్డిగారి మహేశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి జిల్లా ఆర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డిని ఎద్దులపల్లిరోడ్డులోని ఇంటికి వదిలేందుకు బైక్‌పై తీసుకెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా ఎద్దులపల్లిరోడ్డులోని సచివాలయ క్రాస్‌ వద్ద వెనుకవైపు నుంచి స్కార్పియో వాహనం ఢీకొట్టింది. బైక్‌పై నుంచి కిందపడగానే స్కార్పియోలోనుంచి ముఖానికి కర్చీప్‌లు కట్టుకున్న ఆరుగురు వ్యక్తులు దిగి కట్టెలతో దాడి చేసి ఉడాయించారు. కొంతసేపటి తర్వాత అటువైపు వచ్చిన వారు గమనించి మహేశ్వరరెడ్డిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నరసింహారెడ్డి, తిరుపాలమ్మ, భార్య హిమబిందు, కుమార్తె రష్మిక, కుమారుడు జోషిత్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా తరలిరావడంతో ఆస్పత్రి ప్రాంగణం కిటకిటలాడింది. టీడీపీ సింబల్‌ కలిగిన స్కార్పియో వాహనం వెనక నుంచి వచ్చి ఢీకొట్టిందని, తాను కింద పడగానే కట్టెలతో కొట్టి చంపడానికి ప్రయత్నించారని, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేడు ‘పరిష్కార వేదిక’

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలన్నారు. అలాగే అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement