అనంతపురంలోని కమలానగర్‌లో పంచముఖ గణపతి రాయదుర్గంలో వినాయకునికి కరెన్సీ హారం తాడిపత్రిలో పర్యావరణ వినాయకుడు
వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా అంతటా బొజ్జగణపయ్య కొలువుదీరాడు. వేడుకలలో రెండో రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, అన్నదానాలు, ప్రసాదాల పంపిణీ జరిగింది. గజాననుడి జన్మవృత్తాంతంతో పాటు పలు ఘట్టాలను తెలిపే విధంగా రూపుదిద్దుకున్న విగ్రహాలు.. చెడు వ్యవసనాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని తెలిపి జాగరూకతం చేసే ప్రతిమలు.. సమాజ హితోపదేశంతో ఆలోచింపజేసే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక మంటపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. – అనంతపురం కల్చరల్


