యువతి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

యువతి బలవన్మరణం

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

శెట్టూరు: యువతి బలవన్మరణం పొందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. శెట్టూరుకు చెందిన వడ్డే దైవాధీనం, లక్ష్మీదేవి దంపతులకు కుమార్తె జ్యోతి(37)తో పాటు ఒక కుమారుడు ఉన్నారు. జ్యోతి నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. చాలా సంవత్సరాలుగా కుమార్తెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement