అనాథనైన తనకు ‘తల్లికి వందనం’ డబ్బు పడలేదంటూ కీర్తిబాయి అనే బాలిక కలెక్టర్ వద్ద మొర పెట్టుకుంది. ‘మాది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామం. మా నాన్న హనుమంతునాయక్, అమ్మ జయలక్ష్మిబాయి. నాన్న అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం చనిపోయాడు. అమ్మ రెండేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయింది. మేనమామ శీనానాయక్ నన్ను చేరదీసి చదివిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మసముద్రం కేజీబీవీ బ్రిడ్జి స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాను. నాకు రెండేళ్లుగా ‘తల్లికి వందనం’ డబ్బులు రాలేదు. అక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదు. అందుకే ఇక్కడికి వచ్చి కలెక్టర్ సార్‌కు చెప్పుకున్నాను’ అంటూ కీర్తిబాయి వేడుకుంది.


