బొమ్మనహాళ్: తారకాపురంలో కొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవం మంగళవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం గంగా జలంతో అమ్మవారికి అభిషేకించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 101 మంది గొరవయ్యల ప్రదర్శనలతో పాటు నందికోలు, వీరభద్ర కుణిత, మహిళా వీరకాశి నాట్యాల మధ్య రథోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎస్‌ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.


