పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

దంపతులకు గాయాలు

కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంప తులు శోభ, తిప్పేస్వామి గాయపడ్డారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న తిప్పేస్వామి వచ్చే నెలలో జరగనున్న తన కుమార్తె చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కారులో మండలంలోని మాల్యం గ్రామానికి వచ్చాడు. పెళ్లి పత్రి కలు పంచి కారులో బళ్లారికి వెళ్తూ మార్గమధ్యంలోని ఆలూరు వద్ద పైప్‌లైన్‌ పనులు చేస్తున్న హైడ్రాలిక్‌ క్రేన్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. శోభ, తిప్పేస్వామికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement