అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి స్పందన కరువైంది. నిర్ణీత సమయం సమీపిస్తున్నా ప్రజలు ఎవరూ రాకపోవడంతో సమగ్రశిక్ష ఏపీసీ శైలజ కంగారు పడ్డారు. వెంటనే డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బందిని పిలిచి కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని అభ్యర్థించారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి యోగా కార్యక్రమానికి రావాలని ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో అరగంట ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


